Farmers | మిర్చి దండలు మెడలో వేసుకొని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీల నిరసన

Farmers | మిర్చి దండలు మెడలో వేసుకొని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీల నిరసన
Farmers | మిర్చి దండలు మెడలో వేసుకొని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీల నిరసన
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Farmers | మిర్చి రైతులకు (Farmers) మద్దతుగా బీఆర్​ఎస్(BRS)​ ఎమ్మెల్సీలు సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. మిర్చి సాగు చేస్తున్న కర్షకులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ శాసన మండలి(Legislative Council) ఆవరణలో మిర్చి దండలు మెడలో వేసుకొని నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) మాట్లాడుతూ.. ప్రభుత్వం మిర్చి పంటకు మద్దతు ప్రకటించాలని డిమాండ్​ చేశారు. క్వింటాలుకు రూ.25 వేలు చెల్లించాలన్నారు.

రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి (Chilli) సాగు అయితే ఈ సీజన్లో 1.6 లక్షల ఎకరాలకు పడిపోయిందన్నారు. అయినా ధర తగ్గడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నాఫెడ్(NAFED), మార్క్ ఫెడ్ (MARKFED) ద్వారా మిర్చి పంట మద్దతు ధర క్వింటాలుకు రూ.25 వేలు నిర్ణయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Budget Session | అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్​