అక్షరటుడే, ఆర్మూర్: ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకోసం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో రైతన్నలు హాజరవ్వాలని కోరారు.