TGS RTC | అద్దెబస్సుల కోసం సజ్జనార్‌కు రూ.8 కోట్లు చెల్లించిన బీఆర్​ఎస్​

TGS RTC | అద్దెబస్సుల కోసం సజ్జనార్‌కు రూ.8 కోట్లు చెల్లించిన బీఆర్​ఎస్​
TGS RTC | అద్దెబస్సుల కోసం సజ్జనార్‌కు రూ.8 కోట్లు చెల్లించిన బీఆర్​ఎస్​

అక్షరటుడే, హైదరాబాద్: TGS RTC | బీఆర్​ఎస్​ సిల్వర్ జూబ్లీ వేడుకలపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సభ విషయంలో జనసమీకరణ కోసం తమకు 3వేల బస్సులు అద్దెకు కావాలని ఆర్టీసీని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ను బీఆర్​ఎస్​ నేతలు కలిశారు. అద్దె బస్సుల కోసం అవసరమైన రూ.8 కోట్ల చెక్కును సజ్జనార్​కు అందజేశారు.

Advertisement
Advertisement

ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ను బీఆర్​ఎస్​ పార్టీ జనరల్ సెక్రెటరీ రావుల చంద్రశేఖర్​ రెడ్డి, బీఆర్ఎస్​వీ అధ్యక్షుడు శ్రీనివాస్, తుంగబాలు, కురువ విజయ్ కుమార్ కలిశారు. రూ.8 కోట్ల చెక్కును అందజేసి.. కావాల్సిన బస్సుల వివరాలు తెలియజేశారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Supreme Court | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్​ చేసిన సుప్రీం

కాగా, బీఆర్​ఎస్​ అధికారంలో ఉండగా తమ మీటింగ్​లకు ఆర్టీసీ బస్సులను అద్దెకు అడిగితే ఇవ్వలేదని, గతంలో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మరి బీఆర్​ఎస్​ సభ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Advertisement