అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. భీమ్‌గల్ మున్సిపల్ కౌన్సిలర్లు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కౌన్సిలర్లు సీహెచ్ గంగాధర్, బోరు లింగం, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు చెవ్వ అశోక్, సొసైటీ డైరెక్టర్ దశ గౌడ్, మాజీ సర్పంచ్ బాలగంగాధర్, అక్రమ్, ఇక్రమ్, కో ఆప్షన్ మెంబర్ అహ్మదుల్లా తదితరులు హస్తం గూటికి చేరారు. వీరికి సునీల్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.