అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ఢిల్లీ లిక్కర్‌స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచుకున్నారు. అనంతరం పార్టీ నగరాధ్యక్షుడు సిర్ప రాజు, సీనియర్ నాయకుడు సుజిత్‌సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయం గెలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎనగందుల మురళి, ధర్మపురి, చింతకాయల రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.