అక్షరటుడే, బాన్సువాడ : MLC Kavitha | బీఆర్ఎస్(BRS) పార్టీ మైనారిటీలకు అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) అన్నారు.
బాన్సువాడ(Bansuwada) పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్(Iftar) విందులో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఎన్నికల హామీలు అమలులో చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
MLC Kavitha | పార్టీకీ బలమైన కేడర్ ఉంది
బాన్సువాడ నియోజకవర్గంలో పార్టీకి బలమైన కేడర్ ఉందని కవిత అన్నారు. నాయకులు వస్తుంటారు.. పోతుంటారని, నియోజకవర్గానికి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. కేసీఆర్(KCR) ఉద్యమ సమయంలో ఎంతో మంది నాయకులను తయారు చేశారని చెప్పారు. పార్టీ కార్యకర్తలందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) ప్రజలకు సంక్షేమ పథకాలు ఎందుకు అందుతలేవో చెప్పాలని ప్రశ్నించారు. అంతకుముందు పెద్ద హనుమాన్ మందిరంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జుబేర్, సాయిబాబా, గౌస్, అఫ్రోజ్, శివసూరి తదితరులు పాల్గొన్నారు.