అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డారని, వారికోసం సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్ల మహాధర్నాకు ఆటోలో వచ్చి మద్దతు తెలిపారు. ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలను నివారించాలన్నారు. ఏడాదికి రూ.12,000 ఇస్తామని ఇవ్వలేదన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఆటోడ్రైవర్ల కోసం పోరాటం చేస్తామన్నారు. రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ఆటోడ్రైవర్లను ఆదుకుంటామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.