అక్షరటుడే, వెబ్‌డెస్క్: మొబైల్ టారిఫ్‌లకు సంబంధించి ప్రభుత్వరంగ నెట్‌వర్క్ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కీలక ప్రకటన చేసింది. సమీప భవిష్యత్తులో టారిఫ్‌లను పెంచడం లేదని బీఎస్‌ఎన్‌ఎల్ ఛైర్మన్, ఎండీ రాబర్ట్ రవి స్పష్టం చేశారు. ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడారు. వినియోగదారుల సంతోషం, వారి విశ్వాసాన్ని గెలుచుకోవడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. రిలయన్స్ జియో, భారతీ ఎయిన్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ప్రైవేటు ఆపరేటర్లు ఇటీవల టారీఫ్‌లను పెంచిన నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్రకటన చేసింది.