అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగిన మంత్రి మండల సమావేశం ముగిసింది. బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగుస్తుండటంతో కూటమి ప్రభుత్వం పూర్తి బడ్జెట్ ప్రవేశపడుతోంది.