అక్షరటుడే, ఇందూరు : GGH Nizamabad | నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రికి District General Hospital GGH నిత్యం వేల సంఖ్యలో రోగులు వస్తుంటారు. వందల మంది గర్భిణులు చికిత్స treatment పొందుతుంటారు. అయితే రోగుల తాకిడితో గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గర్భిణులు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని Child Welfare Center నిర్మించారు. పనులు పూర్తయి ఐదు నెలలు గడిచినా ఇంకా సేవలు మాత్రం ప్రారంభం కాలేదు.
గర్భిణులు, చిన్నారులకు ప్రత్యేక ఆస్పత్రి special hospital నిర్మించాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ main bus stand ఎదురుగా 2018లో శంకుస్థాపన చేశారు. గతేడాది డిసెంబర్లో పనులు పూర్తి కావడంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి Medical and Health Minister దామోదర రాజనర్సింహ Damodar Rajanarsimha ప్రారంభించారు. అయినా ఇప్పటికీ అందులో సేవలు ప్రారంభించకపోవడం గమనార్హం.
GGH Nizamabad | రూ.40 కోట్లతో నిర్మాణం
మాతాశిశు ఆస్పత్రిని Maternal and Child Hospital రూ.40 కోట్లతో నిర్మించారు. నాలుగు అంతస్తుల్లో మొత్తం 250 పడకలను ఏర్పాటు చేశారు. కానీ ఒకే లిఫ్ట్ ఉందన్న కారణంతో సేవలను ప్రారంభించలేదు. అంత పెద్ద భవనానికి ఒకే ఒక్క లిఫ్ట్ ఎలా నిర్మిస్తారని పలువురు రోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా వీలైనంత తొందరగా సేవలు ప్రారంభించాలని కోరుతున్నారు.
GGH Nizamabad | జీజీహెచ్లో ఇబ్బందులు
జిల్లా జనరల్ ఆస్పత్రిలో District General Hospital నెలకు 250 నుంచి 300 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి రోజుకు పదికి పైగా కూడా ప్రసవాలు జరుగుతాయి. సంబంధిత వార్డులో చిన్నారులు, బాలింతల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. మాతాశిశు ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఇబ్బందులు ఉండవని గర్భిణులు అంటున్నారు.
GGH Nizamabad | ప్రతిపాదనలు పెట్టాం
– శ్రీనివాస్(Srinivas), జీజీహెచ్, సూపరింటెండెంట్
మాతాశిశు ఆస్పత్రి భవనం maternity hospital building పూర్తయింది. కానీ అందులో ఒకే లిఫ్ట్ ఉంది. సేవలు ప్రారంభిస్తే రోగులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే నాలుగు లిఫ్ట్లు కావాలని ప్రతిపాదనలు పంపించాం. అనుమతి రాగానే వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి సేవలను ప్రారంభిస్తాం.