Stock markets | బుల్‌ జోరుకు రికార్డులు బద్దలు.. ఆల్‌టైం హైకి బ్యాంక్‌ నిఫ్టీ

Stock markets | బుల్‌ జోరుకు రికార్డులు బద్దలు.. ఆల్‌టైం హైకి బ్యాంక్‌ నిఫ్టీ
Stock markets | బుల్‌ జోరుకు రికార్డులు బద్దలు.. ఆల్‌టైం హైకి బ్యాంక్‌ నిఫ్టీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock markets | దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బుల్స్‌(Bulls) జోరుకు బేర్స్‌ బేజారయ్యాయి. బ్లూచిప్‌ స్టాక్స్‌(Blue chip stocks) ప్రధానంగా బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో బ్యాంక్‌, ఫిన్‌ నిఫ్టీ ఆల్‌టైం గరిష్టా(All time high)లను తాకింది.

Advertisement

యూఎస్‌, చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ టెన్షన్స్‌తో గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు ఎగుడుదిగుడుల మధ్య కొనసాగాయి. ఆ తర్వాత మార్కెట్‌ను బుల్స్‌ అధీనంలోకి తీసుకోవడంతో ఇండెక్స్‌లు(Indices) పరుగులు తీశాయి. ఇంట్రాడేలో గరిష్టంగా 1,572 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌(Sensex) చివరికి 1,508 పాయింట్ల లాభంతో 78,553 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో గరిష్టంగా 435 పాయింట్లు లాభపడింది.

ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 414 పాయింట్ల లాభంతో 23,851 వద్ద స్థిరపడింది. ట్రంప్‌ టారిఫ్‌(Trump tariff)ల ప్రభావం మనపై పెద్దగా ఉండకపోవచ్చన్న అంచనాలతో పాటు యూఎస్‌, భారత్‌ల మధ్య త్వరలోనే ట్రేడ్‌ అగ్రిమెంట్‌(Trade agreement) కుదిరే అవకాశాలు ఉండడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది. అలాగే రూపాయి విలువ రోజురోజుకు బలపడుతుండడం, ఎఫ్‌ఐఐలు రెండు రోజులుగా నెట్‌ బయ్యర్లు(Net buyers)గా మారడం, ఆసియా మార్కెట్లూ గ్రీన్‌లోనే ఉండడంతో మన మార్కెట్లు కూడా పెరిగాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ సుమారు రూ. 3.8 లక్షల కోట్ల మేర పెరిగింది.

ఇది కూడా చ‌ద‌వండి :  Trump Tariff | ట్రంప్ సుంకాలు స‌హేతుక‌మే.. వైట్‌హౌస్ వెల్ల‌డి

Stock markets | అన్ని రంగాలలోనూ బుల్స్‌ జోరు..

బుల్స్‌ జోరు చూపించడంతో అన్ని రంగాల(All sectors) షేర్లు గ్రీన్‌లోనే క్లోజ్‌ అయ్యాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్ల షేర్లు భారీగా పెరిగాయి. ఇన్‌ఫ్రా, ఎనర్జీ, ఫార్మా(Pharma), ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాలలోనూ కొనుగోళ్ల మద్దతు లభించింది.

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,427 లాభాలతో ముగియగా 1,522 నష్టపోయాయి. మరో 157 కంపెనీలు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అయ్యాయి. 83 కంపెనీలు 52 వారాల గరిష్టాన్ని చేరగా.. 33 కంపెనీలు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. 4 స్టాక్స్‌ అప్పర్‌ సర్క్యూట్‌(Upper cercuit)ను, 6 స్టాక్స్‌ లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers:
బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 28 కంపెనీలు లాభాలతో ముగియగా రెండు కంపెనీలు మాత్రమే స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్‌(జొమాటో) 4.37 శాతం పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ(SBI), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కొటక్‌ బ్యాంక్‌ మూడు శాతానికిపైగా పెరగ్గా.. రిలయన్స్‌(Reliance), యాక్సిస్‌ బ్యాంక్‌, అదాని పోర్ట్స్‌ రెండు శాతానికిపైగా లాభపడ్డాయి.

Top Losers:
టెక్‌ మహీంద్రా(Tech Mahindra) 0.24 శాతం, మారుతి 0.04 శాతం నష్టంతో ముగిశాయి.

Advertisement