అక్షరటుడే, ఆర్మూర్/కామారెడ్డి: BRS | మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం కామారెడ్డి, వేల్పూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కే సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రతిపక్ష నాయకులపై ఇష్టానుసారం మాట్లాడితే స్పీకర్ స్పందించకపోగా వారిని వెనుకేసుకు రావడం తెలంగాణ సమాజం చూస్తుందన్నారు. అన్ని పార్టీలను స్పీకర్ హోదాలో ఉన్నవాళ్లు సమానంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో రేగుళ్ళ రాములు, నీరడి భాగ్య, పిట్ల సత్యం, ప్రతాప్‌రెడ్డి, నోముల రవీందర్, జూకంటి ప్రభాకర్‌రెడ్డి, పిప్పిరి ఆంజనేయులు, కుంబాల రవి యాదవ్, చెలిమెల భాను ప్రసాద్, గోపి గౌడ్, బాలరాజ్ పాల్గొన్నారు.
