అక్షరటుడే, హైదరాబాద్: AC : ఉష్ణోగ్రతలు ఈ నెలలోనే పెరుగుతున్న నేపథ్యంలో.. ఎయిర్ కండీషనర్ల (AC) డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. దీంతో AC తయారీ కంపెనీలు ధరలను 4 – 5 శాతం పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
AC : ఉత్పత్తి పెంచినా..
ప్రముఖ AC తయారీదారులు హైయర్ (Haier), బ్లూస్టార్ (Bluestar) తదితర కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 25 – 30 శాతం పెంచాయి. అయినా పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు ఫిబ్రవరిలోనే బ్లూస్టార్ 3 శాతం ధరలు పెంచింది. హైయర్ 4 – 5 శాతం ధరలు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
AC : ధరల పెరుగుదలకు కారణాలు
AC ధరల పెరుగుదలను అనేక కారణాలు ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా కంప్రెషర్లు, కాపర్ ట్యూబులు లాంటి భాగాల కొరత విపరీతంగా ఉంటోంది. వీటి నిల్వలు తక్కువగా ఉండటంతో పాటు అధిక ఉత్పత్తి వ్యయం కూడా గణనీయంగా పెరిగింది. దీనికి తోడు ఇటీవల డాలర్ మారకం విలువల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకోవడం ఏసీ ధరలకు మరింత ఆజ్యం పోసినట్లైంది.
AC : వినియోగదారులపై ప్రభావం..
వినియోగదారులపై ఈ ధరల పెరుగుదల ప్రభావం ఒక్కో యూనిట్‌కు ₹ 1,500 – ₹ 2,000 వరకు ఉండొచ్చంటున్నారు. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కంపెనీలు వినియోగదారులపై మోపే అవకాశం ఉన్నందున ఆ భారం సగటు మానవుడే మోయక తప్పదు. ఈ వేసవిలో AC కొనుగోలు చేయాలనుకునే వారు, ధరలు మరింత పెరగక ముందే కొనుగోలు చేయడం ఉత్తమమైన మార్గం అని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.