అక్షరటుడే, వెబ్డెస్క్: RTC Bus | నిత్యం వందల కిలోమీటర్లు తిరిగే ఆర్టీసీ బస్సులు దుమ్ము దూళితో అంధవిహీనంగాతయారు అవుతాయి. వాటిని శుభ్రం చేయాలంటే చాలా సమయం పడుతుంది. దీంతో సిబ్బంది అప్పుడప్పుడు మాత్రమే బస్సులను కడిగేవారు. అయితే ప్రస్తుతం ఆ ఇబ్బందులు లేకుండా ఆటోమేటికగ్ బస్సులను కడిగే విధానం అందుబాటులోకి వచ్చింది.
ఈ పద్ధతిలో క్షణాల్లో బస్సు క్లీనింగ్ పూర్తి చేయొచ్చు. ఈ ఆటోమేటిక్ వాషింగ్ ప్లాంట్(automatic washing plant)ను ప్రస్తుతానికి హైదరాబాద్ డిపో–1లో Hyderabad Depot-1 అధికారులు శనివారం ప్రారంభించారు. మిగిలిన జిల్లాలోనూ దీనిని ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధానంతో తక్కువ సమయంలో బస్సులు తళతళమెరుస్తున్నాయి.
New static automatic washing plant started on 05.04.2025 at Hyderabad-I Depot. @TGSRTCHQ @RMRangaReddy pic.twitter.com/KkucKpOF6z
— Dm Hyd1 TSRTC (@dmhyd1tsrtc) April 5, 2025