అక్షరటుడే, వెబ్డెస్క్: Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్దే (Pooja Hegde) పుణ్యక్షేత్ర దర్శనాలను చేసుకుంటోంది. నిన్న శ్రీకాళహస్తిలో శివయ్య దర్శనం చేసుకున్న ఈ హీరోయిన్ నేడు తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుంది. వై.ఐ.పి బ్రేక్ దర్శనంలో పూజా హెగ్దే ఫ్యామిలీతో సహా స్వామి వారి దర్శనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు అర్చకులు పూజా హెగ్దే (Pooja Hegde) కుటుంబానికి ఆశీర్వచనాలు అందించారు.
పూజా హెగ్దే (Pooja Hegde) సడెన్గా ఇలా పుణ్యక్షేత్రాలు తిరగడం చూసి ఆమె ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే తెలుగులో పెద్దగా ఛాన్స్ అందుకోని ఈ అమ్మడు తమిళ్ లో మాత్రం దూసుకెళ్తుంది. ప్రస్తుతం సూర్యతో రెట్రో సినిమాలో నటిస్తుంది (Pooja Hegde) పూజా హెగ్దే. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్దే (Pooja Hegde) ఛాన్స్ అందుకుంది.
Pooja Hegde : దళపతి విజయ్ జన నాయగన్లో..
ఈ సినిమా మే 1న రిలీజ్ కాబోతుంది. సూర్య ఈ సినిమాలో వింటేజ్ లుక్తో అలరిస్తాడని తెలుస్తుంది. ఈమధ్యనే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. ఇదిలాఉంటే పూజా హెగ్దే (Pooja Hegde) దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్లో (Jana Nayagan) కూడా నటిస్తుంది. ఐతే ఆ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్లో (Tollywood) స్టార్ క్రేజ్ కొనసాగించిన పూజా హెగ్దే (Pooja Hegde) ప్రస్తుతం ఇక్కడ ఒక్క ఛాన్స్ కూడా లేక వెనకపడింది.
సూపర్ స్టార్ మహేష్ (Superstar Mahesh) గుంటూరు కారం సినిమా (Guntur Karam Movie) నుంచి తప్పుకున్న తర్వాత పూజాకి ఒక్క అవకాశం కూడా రాలేదు. తెలుగు మేకర్స్ కావాలని పూజా హెగ్డేని దూరం పెడుతున్నారా ఏంటన్న డౌట్ కూడా రేజ్ అవుతుంది. ఐతే పూజా హెగ్డే (Pooja Hegde)మాత్రం తెలుగు ఫ్యాన్స్ కోసమైనా ఇక్కడ ఒక సినిమా చేయాలని ఉత్సాహంగా ఉంది. (Pooja Hegde) పూజా హెగ్డే సినిమాలో ఉంది అంటే మాత్రం గ్లామర్ విషయంలో డౌట్ పడాల్సిన అవసరం లేదన్న రేంజ్లో పాపులారిటీ తెచ్చుకుంది. ముఖ్యంగా పూజా బేబ్ చేసే థై షోకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు.
తిరుమల వెంకన్న సేవలో ప్రముఖ సినీ నటి Pooja Hegde పాల్గొన్నారు pic.twitter.com/cqM7PzyNrl
— Telugu360 (@Telugu360) April 4, 2025