అక్షరటుడే, కామారెడ్డి: విద్యాశాఖలో అక్రమ డిప్యుటేషన్లను వెంటనే రద్దు చేయాలని బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కావాల్సిన చోటకు డిప్యుటేషన్లను వేయించుకున్నారని ఆరోపించారు. డిప్యుటేషన్లతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్, వ్యాపారాలు చేస్తూ విద్యా వ్యవస్థను గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. వెంటనే అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేసి విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రవితేజ, జిల్లా ఉపాధ్యక్షుడు అర్బస్ ఖాన్, ఇంఛార్జి బుల్లెట్, నాయకులు శివ, శ్రావణ్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.