అక్షరటుడే, వెబ్ డెస్క్: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ లతో పాటు ఫీజు రీయింబర్స్ మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని బీవీఎం తెలంగాణ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి అర్బస్ ఖాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వర్సిటీలో ఆందోళన నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యా వ్యవస్థపై దృష్టి పెట్టకపోవడం బాధాకరమన్నారు. ఇంత వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడంతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి తక్షణమే స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని కోరారు.