అక్షరటుడే, వెబ్‌డెస్క్: ELECTRIC CARS | అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల(ELECTRIC CARS) తయారీదారు అయిన టెస్లా భారత్‌లో తన కార్లను విక్రయించడానికి సన్నద్ధమవుతోంది. అయితే టెస్లాకు సవాల్ విసరడానికి చైనాకు చెందిన బీవైడీ(BYD) కూడా సిద్ధమవుతోంది. ఈ సంస్థ భారత్‌లో తన కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.
భారీ మార్కెట్ అవకాశాలు ఉన్న భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడం ద్వారా మార్కెట్ షేర్‌ను పెంచుకోవడానికి టెస్లా(TESLA)తోపాటు బీవైడీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే టెస్లా అధినేత ఎలాన్ మస్క్(ELON MUSK) తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఢిల్లీ, ముంబయిలలో షోరూమ్‌లు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలోనే భారత్(BHARATH)లో టెస్లా కార్ల విక్రయాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో భారత మార్కెట్‌పై చైనాకు చెందిన బీవైడీ కూడా దృష్టి సారించింది.
ఈ సంస్థ ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. ఇటీవల కేవలం 5 నిమిషాల చార్జింగ్‌తో సుమారు 250 మైళ్ల మైలేజీ ఇచ్చే బ్యాటరీని తయారు చేసింది. ఇప్పటికే భారత్‌లో కార్లను విక్రయిస్తున్న ఈ సంస్థ.. ఎలక్ట్రిక్ కార్లతోపాటు వాటికి సంబంధించిన బ్యాటరీలను కూడా తయారు చేయడానికి ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్(HYDERABAD)లో సుమారు రూ. 85 వేల కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 2032 సంవత్సరం వరకు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసి, కార్యకలాపాలను ప్రారంభించాలన్న లక్ష్యంతో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది.
ELECTRIC CARS | మన సంస్థలకూ సవాలే
అతి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే చైనా(CHINA)కు చెందిన బీవైడీ తన యూనిట్‌ను భారత్‌లో నెలకొల్పనుండడం టెస్లాకు సవాల్ కానుంది. ఇదే సమయంలో మన దేశంలో ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే టాటా(TATA), మహేంద్రాలతోపాటు మారుతి కూడా తీవ్ర పోటీని ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఇవి బీవైడీని తట్టుకుని ఎంతవరకు నిలబడతాయన్న అంశంపై మార్కెట్ వర్గాలలో చర్చ నడుస్తోంది.