అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cabinet | ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సవరించిన జాతీయ పాడి అభివృద్ధి కార్యక్రమం కు ఆమోదం తెలిపింది కేంద్ర మంత్రి వర్గం. 15వ ఆర్ధిక సంఘం ప్రకారం ఇప్పుడు బడ్జెట్ రూ.2790 కోట్లకు చేరుకుంది. ఇందులో మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విస్తరించడం, ఉత్పాదకతను నిర్ధారించడం వంటి వాటిపై దృష్టి పెట్టడం జరుగుతుంది. సవరించిన నేపథ్యంలో రైతులు మార్కెట్లకు మెరుగైన ధరలకి అందించడం, ఆదాయాలు, గ్రామీణాభివృద్ధి వంటివి జరుగుతుందని తెలుస్తుంది. ఈ పథకం రెండు భాగాలుగా ఉంటుంది.ఈ పథకం రెండు కీలక భాగాలని కలిగి ఉంటుంది. కాంపోనెంట్ A లో పాల శీతలీకరణ ప్లాంట్లు, అధునాతన పాల పరీక్ష ప్రయోగశాలలు మరియు ధృవీకరణ వ్యవస్థలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం జరుగుతుంది.
Cabinet | చాలా ఉపయోగం..
ఈశాన్య ప్రాంతం , కొండ ప్రాంతాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో పాల సేకరణ మరియు ప్రాసెసింగ్‌ను బలోపేతం చేస్తుంది, కాంపొనెంట్ బీలో జపాన్ ప్రభుత్వం మరియు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ తో సంతకం చేసిన ఒప్పందాల ప్రకారం సహకారం ద్వారా పాడి అభివృద్ధిని ప్రోత్సహించడం జరుగుతుంది. తొమ్మిది రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్) ఉత్పత్తి, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పాడి సహకార సంస్థల స్థిరమైన అభివృద్ధిపై దృష్టి పెడుతుంది.
ఎన్‌పీడీడీ అమలు ఇప్పటికే 18.74 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంది. 0,000 మందికి పైగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలను సృష్టించింది. రోజుకు అదనంగా 100.95 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యాన్ని పెంచింది. మెరుగైన పాల పరీక్ష మరియు నాణ్యత నియంత్రణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో ఎన్‌పీడీడీ మద్ధతుగా నిలుస్తుంది. సవరించిన ఎన్‌పీడీడీ ఈశాన్య ప్రాంతంలో ప్రాసెసింగ్ కోసం 10,000 కొత్త పాల సహకార సంఘాలను స్థాపించాలని, అలాగే ఎన్‌పీడీడీ యొక్క ప్రాజెక్టులకు అదనంగా గ్రాంట్ మద్దతుతో 2 పాల ఉత్పత్తిదారుల కంపెనీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు, దీని ద్వారా అదనంగా 3.2 లక్షల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సవరించిన జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమం, శ్వేత విప్లవం 2.0 తో సమకాలీకంగా ఉంది. భారతదేశ ఆధునిక మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తుంది.