LHDCP : పశు సంపద ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ కార్యక్రమం సవరణకు కేంద్ర కేబినేట్ గ్రీన్ సిగ్నల్

LHDCP : పశు సంపద ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ కార్యక్రమం సవరణకు కేంద్ర కేబినేట్ గ్రీన్ సిగ్నల్
LHDCP : పశు సంపద ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ కార్యక్రమం సవరణకు కేంద్ర కేబినేట్ గ్రీన్ సిగ్నల్
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: LHDCP | మన దేశానికి రైతు వెన్నెముక అని చెబుతుంటాం. అలాగే.. మన సంప్రదాయాలకు, మన దేశ ఔన్నత్యానికి, మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న వాటిలో పశు సంపద ఒకటి. పశు సంపద ఈ దేశానికి ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అందుకే మన దేశ పశు సంపదను కాపాడుకోవడం కోసం కేంద్రం పశు సంపద ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ కార్యక్రమం పేరుతో ఒక ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ కోసం 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు గాను, కేంద్ర బడ్జెట్ లో రూ.3880 కోట్లను కేటాయించింది.

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో పశు సంపద ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ కార్యక్రమం సవరణకు ఆమోద ముద్ర వేశారు. ఈ పథకంలో ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయి. నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఎల్‌హెచ్ అండ్ డీసీ, పశు ఔషధి. ఎల్‌హెచ్ అండ్ డీసీలో మూడు ఉప అంశాలు ఉంటాయి. అందులో క్రిటికల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, వెటర్నరీ హాస్పిటల్స్, డిస్పెన్షనీలు ఉంటాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Cabinet | ఎన్‌పీడీడీ కార్య‌క్ర‌మానికి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి వ‌ర్గం

LHDCP : పశు సంపద ఉత్పాదకతను పెంచడం, ఉపాధి కల్పించడం

ఈ పథకం ముఖ్య ఉద్దేశం పశు సంపద ఉత్పాదకతను పెంచడం, గ్రామీన ప్రాంతాల్లో ఉపాధి కల్పించడం. పశుసంపదకు వచ్చే వ్యాధులను నియంత్రించడం కోసం టీకాలు, వాటిని పర్యవేక్షించడం, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడం కోసం ఉపయోగపడుతుంది. వ్యవస్థాపకతను ప్రోత్సహించి.. రైతులకు పశువులకు వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించి, వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేలా ఈ పథకం సాయపడుతుంది.

Advertisement