అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cabinet Expansion మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion)తో పాటు పలు ఇతర విషయాలపై చర్చిండానికి సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఢిల్లీ(Delhi) వెళ్లిన విషయం తెలిసిందే. ఇందిరా భవన్‌లో ఏఐసీసీ(AICC) అగ్రనేతలతో వీరు సోమవారం రాత్రి భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం.
Cabinet Expansion | మంత్రి పదవుల లెక్క తేలిందా..
ఏఐసీసీ పెద్దలతో సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్(Mahesh Goud) ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం వారు తిరిగి రానున్నట్లు సమాచారం. అయితే మంత్రివర్గ విస్తరణపై ఈ భేటీలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
బడ్జెట్ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓ బీసీ నేతతో పాటు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే(MLA)లకు పదవులు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఒకటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కేటాయించనున్నట్లు తెలిసింది.