అక్షరటుడే, గాంధారి:Gandhari | కేబుల్, మోటార్ల దొంగతనానికి పాల్పడుతున్న ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన గాంధారి మండలం తిమ్మాపూర్(Thimmapur gandhari mandal)లో చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. బాన్సువాడ, బోధన్ నుంచి ఇద్దరు వ్యక్తులు గ్రామానికి రాగా అనుమానం వచ్చిన గ్రామస్థులు వారిని తనిఖీ చేశారు.
దీంతో వీరిలో ఓ వ్యక్తి పారిపోయాడు. మరొకరిని గ్రామస్థులు పట్టుకుని అతని బ్యాగ్ చెక్ చేయగా వ్యవసాయ భూముల వద్ద గల మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్లు, మోటార్లకు సంబంధించిన వస్తువులు కనిపించాయి. దీంతో అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. సంబంధిత వ్యక్తుల వాహనాలను సైతం పోలీసులకు(gandhari Police) అప్పజెప్పారు.