అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవోస్) క్యాలెండర్‌ను శనివారం ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆవిష్కరించారు. టీఎన్జీవోస్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో క్యాలెండర్ విడుదల చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. టీజీవో కేంద్ర బాధ్యుడు శ్రీనివాస్ రెడ్డి, ఐకాస ఛైర్మన్ అలుక కిషన్, అమృత్ కుమార్, నేతికుంట శేఖర్, శ్రీనివాస్, సుమన్, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.