Campa Cola | ‘కాంపా కోలా’ను తెగ తాగేస్తున్నారు.. రికార్డు స్థాయిలో అమ్మకాలు

Campa Cola | ‘కాంపా కోలా’ను తెగ తాగేస్తున్నారు.. రికార్డు స్థాయిలో అమ్మకాలు
Campa Cola | ‘కాంపా కోలా’ను తెగ తాగేస్తున్నారు.. రికార్డు స్థాయిలో అమ్మకాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Campa Cola | ఒకప్పుడు భారత మార్కెట్​ను శాసించిన కాంపా కోలా(Campa Cola) తర్వాత కనుమరుగు అయిపోయింది. 1980, 90 దశకాల్లో కాంపా కోలా శీతల పానీయంకు మంచి డిమాండ్​ ఉండేది. తర్వాత పెప్సీ కో(Pepsi co), కోకో కోలా (cococ cola) కంపెనీలు మార్కెట్​లో ఆధిపత్యం చెలాయించడంతో కాంపా కోలా అమ్మకాలు పడిపోయాయి. తర్వాత కంపెనీ మరుగున పడింది. అయితే ఈ భారతీయ కూల్​డ్రింక్​ను తిరిగి రిలయన్స్​ మార్కెట్​లోకి తీసుకొచ్చి రికార్డు స్థాయిలో అమ్మకాలు చేపట్టింది.

Advertisement

Campa Cola | రూ.22 కోట్లకు కొనుగోలు

కాంపా కోలా కంపెనీని రూ. 22 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ.. రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) కొనుగోలు చేసింది. 18 నెలల వ్యవధిలోనే రూ.వెయ్యి కోట్ల ఆదాయం సంపాదించింది. రూ.10కే కాంపా కోలా బాటిళ్లను రిలయన్స్​ ప్రవేశపెట్టింది. దీంతో మార్కెట్​లో మంచి స్పందన వస్తోంది. తక్కువ ధరకు కూల్​ డ్రింక్​ లభిస్తుండటంతో కాంపా కోలా కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం భారత శీతల పానీయాల మార్కెట్​లో కోకో కోలా 60శాతం, పెప్సీకో 33 శాతం వాటా కలిగి ఉన్నాయి. కాంపా కోలా 2శాతం మాత్రమే ఉంది. అయితే భవిష్యత్​లో తన వాటాను పెంచుకోవడానికి ఈ సంస్థ కసరత్తు చేస్తోంది. తనకున్న రిటైల్​ వ్యవస్థతో ఈ కూల్​ డ్రింక్​ను మార్కెట్​లోకి తీసుకెళ్లి విజయవంతం అయిన రిలయన్స్​ మెల్లిమెల్లిగా వాటా పెంచుకోవాలని చూస్తోంది.

Advertisement