Health Problems : అయ్య బాబోయ్.. కందిపప్పుతో క్యాన్సరా..! ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు.. ఇది నిజమా..?

Health Problems : అయ్య బాబోయ్.. కందిపప్పుతో క్యాన్సరా..! ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు.. ఇది నిజమా..?
Health Problems : అయ్య బాబోయ్.. కందిపప్పుతో క్యాన్సరా..! ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు.. ఇది నిజమా..?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Health Problems : చాలామంది ప్రజలు కందిపప్పుతో చేసిన పప్పుని ఇష్టంగా తింటూ ఉంటారు. వారంలో ఒక్కసారైనా సరే పప్పు లేనిదే ముద్ద పోదు. కొందరైతే పప్పుతో సాంబారు చేసుకుని మరి ఇష్టంగా తింటూ ఉంటారు. అంటే కందిపప్పు తింటే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా, క్యాన్స‌ర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు మనకు గుర్తొచ్చేది కందిపప్పు. ఈ కందిపప్పు వంటకం లో ఎన్నో ఆకుకూరలను వేసి కూడా వండుతాము. ఇంటిలో కందిపప్పు కూడా కల్తీ అయిపోతే మరి ఏం తినాలి. కందిపప్పు వల్ల క్యాన్సరే కాక ఇంకా మరేన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ విషయంపై క్షుణ్ణంగా తెలుసుకుందాం…

Toor Dal కందిపప్పు : పప్పు తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది, అంతే కాదు, నరాల సంబంధిత వ్యాధులకు సంబంధం ఉంది. ఒక వివాదస్పద చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కెరలు కొడుతుంది. ఈ ట్విట్ మొదట ఒక కన్నడ ద్వారా తెరపైకి వచ్చింది.మీడియాలో వారు చేసిన ట్విట్ లో కందిపప్పు తినడం వల్ల త్రీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని, న్యూరోపతి అనగా , నరాల స్పెషలిస్ట్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలియజేశారు. ఇటువంటి అంశం కర్ణాటకలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల్లో కూడా ఆందోళన కలిగిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా కందిపప్పుని తింటూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇంటి పరిస్థితుల్లో ప్రజలు నిజమేనా అని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు. ఆరోగ్య నిపుణులు ఈ విషయంపై చాలా జాగ్రత్తగా స్పందిస్తున్నారు. కందిపప్పులో ప్రోటీన్లు, ఫైబర్, పోషకాలు సమృద్ధిగా ఉంటాయని. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సాధారణంగా నిపుణులు చెబుతూనే ఉంటారు.

కొంతమంది నిపుణులు అయితే, ప్రజల ఆందోళన వెనుక కొంచెం నిజం కూడా దాగి ఉందని అంటున్నారు. ఎందుకో తెలుసా.. పప్పు ఉత్పత్తి సమయంలో ఉపయోగించే పురుగుల మందులు లేదా రసాయనాలు అనారోగ్యం పై ప్రభావం చూపవచ్చు. ఈ రసాయనాలు అధికంగా ఉంటే దీర్ఘకాలికంగా క్యాన్సర్ వంటి వ్యాధులు కారణమవుతాయని అధ్యయనాలలో తెలిపారు. ఇది కేవలం కందిపప్పు కి మాత్రమే వర్తిస్తుందా అనేది తెలియదు. ఇలాంటి అధ్యయనాలు కందిపప్పు పై మాత్రం జరగలేదు.మరికొంతమంది కందిపప్పు కి రసాయన రంగులు కలుపుతున్నారు, కాబట్టి ఆ కందిపప్పు చూడడానికి అందంగా, ఆకర్షీనీయంగా కనిపిస్తుంది.ఆ కందిపప్పుని వెంటనే మనం కొనుగోలు చేస్తాం. ఇలాంటి కందిపప్పును, హోట్ట‌ల్లో భారీ ఎత్తున కొనే అవకాశాలు ఉన్నాయి అని.. దాంతో సాంబార్ చేసే ప్రమాదం ఉందని వాదన తెరపైకి వచ్చింది. ఈ సాంబార్ తినే వారిపై.. రసాయన రంగుల ప్రభావం ఉంటుందని, దీంతో లాథైరిజం అనే తీవ్రమైన నాడి సంబంధిత రోగం రావచ్చని అంటున్నారు నిపుణులు. ఇది క్యాన్సర్ కూడా దారి తీయవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  cell tower | సెల్ టవర్ ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళన

మహారాష్ట్రలోని కొండ ప్రాంతాల్లో, ఉత్తర భారత దేశంలో మరికొన్ని ప్రాంతాలలో, విస్తారంగా పెరిగే కందిపప్పుని కొంతమంది రసాయన రంగులను కలిపి, త‌క్కువ ధరకే అమ్ముతున్నారని.. ముఖ్యంగా టెట్రాజిన్ ( E- 102 ) అనే డైని కందిపప్పుతో కలుపుతున్నారని తెలుస్తుంది. కాబట్టే ఈ కందిపప్పు క్వాలిటీ కందిపప్పులా కనిపిస్తుంది. రసాయన రంగు కలపడం చేత క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. టెట్రాజిన్ (E-102) కలిపిన కందిపప్పుతో, హోట్ట‌ల్లో సాంబార్ చేసిన, ఇంకా ఇళ్లల్లో పప్పు వండుకొని తిన్నా అనారోగ్య సమస్యలు తప్పవు అని హెచ్చరిస్తున్నారు. మరింత లోతైన పరిశోధనలు జరగాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రేషన్ ద్వారా కందిపప్పు పంపిణీ ఏప్రిల్ నుంచి మళ్లీ ప్రారంభం కాబోతుంది. సమయంలో ఇటువంటి వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారణ జరుగుతుంది. ప్రభుత్వమే స్వయంగా ఇస్తున్న కందిపప్పు కాబట్టి, ఇందులో ఎటువంటి రసాయన రంగులు కలప బోరు అని చెప్పవచ్చు.

కాబట్టి వైద్యులు, రేషన్ కందిపప్పు విషయంలో ఆందోళన చెందవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేలా కందిపప్పుని మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్నారే అనుకో.. ఆ కంది పప్పుని వెంటనే వండే ప్ర‌యత్నం చేయవద్దు. మొదట ఆ కందిపప్పుని శుభ్రంగా కడిగి, తరువాతే వండుకోవాలి.సోష‌ల్ మిడియాలో కలకలం వార్తలని పూర్తిగా నమ్మడం మానేసి.. ఆరోగ్య‌కరమైన ఆహారపు అలవాటులను కొనసాగించేలా చూసుకోవాలి. ఎదైనా సరే బాగా కడిగిన తర్వాత వండుకొని తింటే అవి కూరగాయలైన,పప్పులైన. ఇలా చేస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కూరగాయల పైన కూడా రసాయనాలను ఉపయోగిస్తారు. కూరగాయలని కూడా శుభ్రంగా కడిగి ఆ తరువాత వంటలో వినియోగించాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం.

Advertisement