అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ప్రధానమంత్రి కౌశల్ యోజన కింద వివిధ కోర్సులు పూర్తిచేసినా తమకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. సోమవారం నగరంలోని యెండల టవర్స్ వద్ద గల ‘సింక్రో సర్వ్’ ఏజెన్సీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి కౌశల్ యోజన కింద స్కిల్ డెవలప్‌మెంట్ ట్రెనింగ్ పూర్తి చేసి మూడు నెలలు గడుస్తోందని అభ్యర్థులు తెలిపారు. 800 మందికి పైగా కోర్సులు పూర్తి చేశామని.. ఇన్ని రోజులైనా సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు అడిగితే డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. అనంతరం మేనేజ్‌మెంట్‌ను నిలదీశారు.
కోర్సు పూర్తిచేసినా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు..
Advertisement
Advertisement