అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Fire Accident | షార్ట్ సర్క్యూట్(Short Circuit)తో కారు(Car) దగ్ధమైన ఘటన నగరంలోని వినాయక్‌నగర్(Vinayak nagar)లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూహౌజింగ్ బోర్డు కాలనీ(New Housing Board Colony)లో నివాసముండే సతీశ్ చంద్ర(Satish Chandra) తన ఇంటి ఎదుట కారు నిలిపి ఉంచగా.. షార్ట్ సర్క్యూట్(Short Circuit) కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో సతీశ్ చంద్ర ఫైర్‌స్టేషన్(Fire Station)కు సమాచారం అందించగా స్పందించిన సిబ్బంది(Staff) ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఫైర్‌స్టేషన్ ఎస్ఎఫ్వో నర్సింగ్‌రావు, సిబ్బంది విష్ణుకుమార్, ఏసురత్నం, సతీశ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.