అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని కంఠేశ్వర్‌ బైపాస్‌ చౌరస్తా వద్ద కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. గురువారం సాయంత్రం సిగ్నల్‌ కూడలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కారు బస్సు డోరు వద్ద తగలడంతో అక్కడే ఇరుక్కుపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ నుంచి కిందకు దించారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.