Police | పోలీసులపైకి దూసుకొచ్చిన కారు.. కానిస్టేబుల్ దుర్మరణం

Police | పోలీసులపై దూసుకొచ్చిన కారు..కానిస్టేబుల్ దుర్మరణం
Police | పోలీసులపై దూసుకొచ్చిన కారు..కానిస్టేబుల్ దుర్మరణం
Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Police : అర్ధరాత్రి విధులు నిర్వహిస్తున్న పోలీసుల(police duty) పైకి ఓ మృత్యు శకటం దూసుకొచ్చింది. ఓ మందుబాబు పీకల దాకా మద్యం తాగి, ర్యాష్​ డ్రైవింగ్​తో కారును పోలీసులపైకి ఎక్కించి కానిస్టేబుల్​ ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి (Gandhari Mandal road accident) మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం.. కానిస్టేబుళ్లు రవికుమార్ (constable Ravi Kumar), సుభాష్ బుధవారం అర్ధరాత్రి గాంధారిలోని హనుమాన్ టిఫిన్ సెంటర్ ఎదుట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అతివేగంగా వస్తున్న కారు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. సుభాష్ గాయాలతో బయటపడ్డారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Court | హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు

గాంధారికి చెందిన ఓ మెడికల్ ప్రాక్టీషనర్ కుమారుడు కారు నడిపినట్లు సమాచారం. పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రవికుమార్​కు ఏడాది వయసు ఉన్న బాబు ఉన్నాడు. విధుల నిర్వహణకు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇంటి పెద్ద దిక్కు ఉదయం శవమై తిరిగి రావడంతో ఆ కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

Advertisement