TGRJC | ఉత్తమ విద్యకు కేరాఫ్‌ టీజీఆర్‌జేసీ.. ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ జారీ

TGRJC | ఉత్తమ విద్యకు కేరాఫ్‌ టీజీఆర్‌జేసీ
TGRJC | ఉత్తమ విద్యకు కేరాఫ్‌ టీజీఆర్‌జేసీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGRJC | రాష్ట్ర ప్రభుత్వం(State Government) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గురుకుల జూనియర్‌ కళాశాలలు (TGRJC) నాణ్యమైన ఇంటర్‌ విద్య(Intermediate education) అందించే ఉత్తమ వేదికలుగా నిలుస్తున్నాయి. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తున్న ఈ కళాశాలల్లో ఉచిత హాస్టల్‌ సౌకర్యం(Free hostel facility) ఉంటుంది. రాష్ట్రంలో 35 కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఎంపీసీ(MPC), బైపీసీ(BIPC), ఎంఈసీ(MEC)లలో సీట్ల భర్తీ కోసం నిర్వహించే పరీక్ష(టీజీఆర్‌జేసీ సెట్‌)కు నోటిఫికేషన్‌ వెలువడింది.

Advertisement
Advertisement

TGRJC | నోటిఫికేషన్‌ వివరాలు..

ELIGIBILITY:

తెలంగాణ రాష్ట్రానికి చెంది, 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల(Accredited school) నుంచి పదోతరగతి(10th Class) లేదా తత్సమాన పరీక్ష రాసిన వారు అర్హులు.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌(Online) ద్వారా ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు రూ.200 కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.

ఇది కూడా చ‌ద‌వండి :  Polavaram Project Authority | పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం..పలు కీలక నిర్ణయాలు

పరీక్ష విధానం, సమయం : మల్టిపుల్‌ ఛాయిస్‌(Multiple choice) విధానంలో 150 ప్రశ్నలు ఉంటాయి. రెండున్నర గంటల సమయం ఇస్తారు. దరఖాస్తులో ఎంచుకున్న ఇంటర్‌ గ్రూపు ప్రకారం ప్రశ్నలు వస్తాయి.

EXAM CENTERS :

ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లా కేంద్రాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు ఏ కేంద్రాన్నైనా ఎంపిక చేసుకోవచ్చు.

పరీక్ష తేదీ : మే 10, 2025 ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు.
ఇతర వివరాలు, దరఖాస్తు చేసుకోవడానికి సంప్రదించాల్సిన వెబ్‌సైట్‌: tgrjc.cgg.gov.in

Advertisement