అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Haryana | మాములుగా సూట్‌కేసుల్లో suitcases బట్టలు, ఇతర వస్తువులు పెట్టుకుంటాం. కానీ ఓ విద్యార్థి మాత్రం ఏకంగా గర్ల్ఫెండ్ను girlfriend పెట్టుకున్నాడు. ఎందుకు అనుకుంటున్నారా..? అయితే ఈ వార్త చదవాల్సిందే..!
తన హాస్టల్లోకి లవర్‌ను తీసుకు వెళ్లడానికి ఓ యువకుడు ఈ ప్లాన్ వేశాడు. ట్రాలీ సూట్‌కేసులో trolley suitcase యువతిని పెట్టుకొని వెళ్తుండగా అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయడంతో విద్యార్థి బాగోతం బయట పడింది.
హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ఓ.పీ యూనివర్సిటీలో O.P. University in Sonipat చదువుతున్న విద్యార్థి బాయ్స్ boys’ hostel హాస్టల్లోని తన రూమ్‌లోకి గర్ల్ ఫ్రెండ్‌ను తీసుకువెళ్లాలి అనుకున్నాడు. ట్రాలీ సూట్‌కేసులో trolley suitcase యువతిని కూర్చొపెట్టి లాక్కొని వస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారు. కాగా సదరు విద్యార్థులపై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో social media వైరల్ viral అవుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
సూట్‌కేస్‌లో గర్ల్ఫెండ్తో హాస్టల్లోకి వెళ్లడానికి యత్నించిన విద్యార్థి
సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో దొరికిపోయిన వైనం#viralvideo #opjindaluniversity #OPJM #opjindal #student #girlfriend #lovers pic.twitter.com/1JbtZGopIU— Akshara Today (@aksharatoday) April 12, 2025