OpenAI, Grok | ఏఐతో కార్టూన్​ స్టైల్​ ఫొటోలు సరే.. వాటితో మీ ఫోన్ ఓపెన్​ చేస్తే ప్రమాదమే..!

OpenAI, Grok | ఏఐతో కార్టూన్​ స్టైల్​ ఫొటోలు సరే..వాటితో మీ ఫోన్ ఓపెన్​ చేస్తే ప్రమాదమే!
OpenAI, Grok | ఏఐతో కార్టూన్​ స్టైల్​ ఫొటోలు సరే..వాటితో మీ ఫోన్ ఓపెన్​ చేస్తే ప్రమాదమే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: OpenAI Grok ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఫీచర్​ Ghibli-శైలి AI చిత్రం ట్రెండింగ్‌గా మారింది. రాజకీయ నేతలు, ప్రముఖులు, సామాన్య ప్రజలు సైతం తమ ఫొటోలు Hayao Miyazaki శైలిలో మార్పు చేసి, తెగ షేర్ చేస్తున్నారు. Elon Musk Company xAI కూడా Grok 3 ద్వారా ఈ ఫీచర్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచింది.

Advertisement
Advertisement

కాగా, ఈ ఫీచర్ల(features)పై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ట్రెండ్‌ మోజులో పడితే.. వారి వ్యక్తిగత వివరాలను AI ఉపయోగింకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. GDPR ప్రకారం.. OpenAI వెబ్ స్క్రెప్ చేయడం అనేది కఠినమైన నిబంధనల(strict rules)కు లోబడి చేయాలి. కానీ, వినియోగదారులు స్వయంగా తమ ఫొటోలు అప్లోడ్ చేయడం ద్వారా, OpenAI కు మరింత స్వేచ్ఛ ఇస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

OpenAI ముఖ్యమైన సందేహాలు ఇవే..

AI యూజర్ల ఫొటోలను శాశ్వతంగా భద్రపర్చుకుంటుందా..?
వ్యక్తిగత డేటా గోప్యత విషయంలో ఎటువంటి హామీ లేకుండా AI మోడళ్లకు డేటా చేరుతుందా?
భవిష్యత్తులో AI మీ ముఖాన్ని ఇతర సందర్భాల్లో మళ్లీ ఉపయోగించుకుంటే ఎలా?

మరో అతి ముఖ్యమైన సందేహం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. ఇలా అప్​లోడ్​ చేసే ఫొటోలను ఉపయోగించుకుని, సదరు వ్యక్తి మొబైల్  ఫేస్​ రికగ్నైజ్(face recognition)​ ద్వారా ఓపెన్​ చేసి, డేటా మొత్తం తస్కరిస్తే.. యూపీఐ యాప్స్ ద్వారా డబ్బులను కాజేస్తే.. ఏంటి పరిస్థితి అనేది ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

 

Advertisement