Bheemgal | విద్యార్థిని గాయపరిచిన టీచర్​పై కేసు

Bheemgal | విద్యార్థిని గాయపరిచిన టీచర్​పై కేసు
Bheemgal | విద్యార్థిని గాయపరిచిన టీచర్​పై కేసు
Advertisement

అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | మండలంలోని పల్లికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని చితకబాదిన ఘటనలో ఉపాధ్యాయుడు భూమేశ్​పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్​ తెలిపారు. గాయపడిన విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా.. సదరు బాలుడు అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తన అన్నయ్యతో గొడవపడి బస్సు కిందకు తోసేశాడు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు భూమేష్ కర్రతో బాలుడిని చితకబాదాడని ఎస్సై తెలిపారు. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Bheemgal | విత్తన దుకాణాల ఎదుట రైతుల ఆందోళన