అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS working president), మాజీ మంత్రి కేటీఆర్‌పై నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్(Nakirekal police station)లో రెండు కేసులు నమోదయ్యాయి.
పదో తరగతి పరీక్ష పత్రం లీకేజీ(10th Class exam paper leak) వ్యవహారంలో తమ ప్రమేయం లేకున్నా కేటీఆర్ తప్పుడు ప్రచారం చేశారని మున్సిపల్ ఛైర్‌పర్సన్ రజిత(Municipal Chairperson Rajitha), మరో వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జిలు మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌పై కేసులు నమోదు చేశారు.