YouTuber | యూట్యూబర్‌ హర్షసాయిపై కేసు నమోదు

YouTuber | యూట్యూబర్‌ హర్షసాయిపై కేసు నమోదు
YouTuber | యూట్యూబర్‌ హర్షసాయిపై కేసు నమోదు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: YouTuber | యూట్యూబర్​ హర్షసాయికి సైబరాబాద్​ పోలీసులు షాక్​ ఇచ్చారు. బెట్టింగ్​ యాప్స్​ ప్రమోట్​ చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. యూట్యూబ్​లో తన వీడియోల ద్వారా ఫేమస్​ అయిన హర్షసాయి ఇటీవల బెట్టింగ్​ యాప్స్​ ప్రమోట్​ చేశాడు. సోషల్​ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లు బెట్టింగ్​ యాప్స్​ ప్రమోట్​ చేయొద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ సూచించారు. అయితే దానికి హర్షసాయి స్పందిస్తూ తాను ప్రమోట్​ చేయకపోతే మరొకరు చేస్తారని తన చర్యలను సమర్థించుకున్నాడు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్​ యాప్స్​ ప్రమోట్​ చేస్తున్న భయ్యా సన్నీయాదవ్​పై కూడా సూర్యాపేట జిల్లా పోలీసులు తాజాగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఇది కూడా చ‌ద‌వండి :  Betting | బెట్టింగ్​ యాప్​​ ప్రమోటర్లకు సజ్జనార్​ వార్నింగ్​

YouTuber | గతంలోనూ కేసు

హర్షసాయిపై గతంలోనూ కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఆయనపై ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన నుంచి రూ.రెండు కోట్లు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో ఆయనపై అరెస్ట్​ వారెంట్​ కూడా జారీ అయింది. అయితే కోర్టు బెయిల్​ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్న హర్షసాయి తాజాగా బెట్టింగ్​ యాప్స్​ ప్రమోట్​ చేసి మళ్లీ వార్తల్లో నిలిచాడు.

Advertisement