అక్షరటుడే, ఇందూరు:Congress Nizamabad | కక్షసాధింపులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం(Central government) సోనియా కుటుంబంపై కేసులు నమోదు చేసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జావెద్ అక్రమ్(Javed akram), ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రధాని మోదీ(Prime minister modi) దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ(Bjp) ఎన్ని కుట్రలు చేసినా చివరికి సత్యం గెలుస్తుందన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈడీ(ED) కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, నగర మహిళా అధ్యక్షురాలు రేవతి, రామకృష్ణ, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.