Advertisement
అక్షరటుడే, ఆర్మూర్: మండలంలోని చేపూర్‌లో శుక్రవారం సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు ప్రారంభించారు. నీటి పారుదల సంఘం మాజీ ఛైర్మన్ సాయిరెడ్డి, ఆర్మూర్ మండలాధ్యక్షుడు చిన్నారెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రూ.16లక్షలతో గ్రామంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్, సాయన్న, గంగారెడ్డి, గంగాధర్, శ్రీనివాస్, శాంతికుమార్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement