Women’s Day | సుభాష్​ నగర్​ పోస్ట్ ఆఫీసులో మహిళా దినోత్సవ వేడుకలు

సుభాష్​ నగర్​ పోస్ట్ ఆఫీసులో వేడుకలు
సుభాష్​ నగర్​ పోస్ట్ ఆఫీసులో వేడుకలు
Advertisement

అక్షరటుడే, ఇందూరు: Women’s Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ పోస్ట్ ఆఫీస్ లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తపాలా శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్​ సురేఖ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల కిష్టయ్య మాట్లాడుతూ.. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో రాణిస్తున్నారన్నారు. ఒక సైంటిస్ట్ గా, యాక్టర్ గా, ఒక డాక్టర్ గా, ఒక సేవ చేసే మహిళగా రాజకీయరంగంలో, ఒక రాష్ట్రపతిగా, ఒక ప్రధానమంత్రిగా అత్యుత్తమ రంగాలలో తమ ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. బాలికల విద్యను తల్లిదండ్రులు, ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరారు.

ఇది కూడా చ‌ద‌వండి :  MLC Results : బీజేపీ నాయకుల సంబురాలు

అసిస్టెంట్ సూపరింటెండెంట్​ సురేఖను పి. ధనలక్ష్మి శాలువాతో సన్మానించారు. భీమ్ ఆర్మీ అధ్యక్ష కార్యదర్శులు మాదాలే అజయ్, బత్తుల కృష్ణయ్య పూల బోకే ఇచ్చి సన్మానించారు. మహిళా సిబ్బందిని అసిస్టెంట్ సూపరింటెండెంట్ సురేఖ సత్కరించారు. అనంతరం కేకు కట్ చేశారు. కార్యక్రమంలో సుభాష్ నగర్ పోస్ట్ మాస్టర్ గంటా రాజన్న, దత్తాత్రి, సురేష్, పోస్ట్ మెన్, సిబ్బంది, భీమ్ ఆర్మీ పట్టణ అధ్యక్షులు విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement