అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HCU Lands | పలువురు రాజకీయ నాయకులు(politicians), సినీ ప్రముఖులు (film celebrities) తాము పెట్టిన ట్వీట్లను(tweets) తొలగిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల వ్యవహారంలో ఏఐ(AI)తో సృష్టించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయ్యాయి. ప్రభుత్వం వేలం వేయాలనుకున్న ఆ భూముల్లో జింకలు(Deers), నెమళ్లు(Peacocks), అటవీ జంతువులు(Forest animals) ఉన్నట్లు కొందరు ఫేక్ ఫొటోలు, వీడియోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారు.
HCU Lands | షేర్ చేసిన పలువురు
ఫేక్, నకిలీ వీడియోలను పలువురు ప్రముఖులు సైతం పోస్టులు చేయడంతో కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల వ్యవహారం వివాదానికి దారి తీసింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ధ్రువ్రాఠి, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మిర్జా, రవీనా ఠండన్ లాంటి వారు ఈ నకిలీ ఫొటోలు (Fake photos), వీడియోలను(videos) తమ వ్యక్తిగత ఖాతాల్లో పోస్టు చేశారు. కాగా నకిలీ ఫొటోలు వ్యాప్తి చేసిన వారిపై ప్రభుత్వం సీరియస్(Government Serious) అయింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు.
HCU Lands | హైకోర్టులో పిటిషన్
ఏఐ(AI)తో నెమళ్లు, జింకలు ఉన్న ఫొటోలు(Photos) సృష్టించి ఆందోళనలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. ఈ మేరకు సోమవారం పిటిషన్(Pitition) వేయగా.. ఈ నెల 24న ధర్మాసనం దానిని విచారించనుంది.
కాగా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy), మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి(Former Minister Jagadish Reddy) తమ పోస్టులను డిలీట్ చేశారు. మిగతా వారు సైతం వాటిని తొలగించనున్నట్లు సమాచారం. కాగా ఈ ఫేక్ ఫొటోలు సృష్టించారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్(BRS leader Manne Krishank)కు ఇదివరకే గచ్చిబౌలి పోలీసులు నోటీసులు(Notice) ఇచ్చారు. ఏఐ(AI)తో ఫొటోలు తయారు చేసి వివాదాన్ని పెద్దది చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.