Team India : టీమిండియాని ఆకాశానికి ఎత్తేస్తున్న సెల‌బ్రిటీలు.. ఎవ‌రెవ‌రు ఏమ‌న్నారంటే..!

Team India : టీమిండియాని ఆకాశానికి ఎత్తేస్తున్న సెల‌బ్రిటీలు.. ఎవ‌రెవ‌రు ఏమ‌న్నారంటే..!
Team India : టీమిండియాని ఆకాశానికి ఎత్తేస్తున్న సెల‌బ్రిటీలు.. ఎవ‌రెవ‌రు ఏమ‌న్నారంటే..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌  Team India : ఎంతో ఉత్కంఠ‌గా జ‌రిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో టీమిండియా విశ్వ విజేత‌గా నిలిచింది. టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్ గెలుచుకుంది. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు 9 నెలల్లో రెండవ ట్రోఫీని అందుకోవ‌డం విశేషం. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో, అద్భుతమైన బౌలింగ్, కెప్టెన్ రోహిత్ శర్మ బలమైన ఇన్నింగ్స్ సహాయంతో టీమ్ ఇండియా విజ‌యం సాధించింది. గ‌త 25 ఏళ్ల క్రితం ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో భార‌త్‌పై గెలిచి క‌ప్ సాధించింది న్యూజిలాండ్ జ‌ట్టు. ఇప్పుడు ప్ర‌తీకారం తీర్చుకుంది. అయితే టీమిండియా సాధించిన విజ‌యం ప‌ట్ల సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Team India : ప్ర‌శంస‌ల వ‌ర్షం..

ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా బెస్ట్ విషెస్ అంద‌జేశాడు. టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చిందని అన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ గెలుచుకున్న టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు తెలిపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌… మీ అంకితభావం, కృషి మరియు ప్రతిభ అద్భుతం అంటూ పోస్ట్ చేశారు. ఈ టోర్నమెంట్ మొత్తంలో భారత జట్టు దేన్నీ తగ్గనీయకుండా అదరగొట్టిందని పవన్ పేర్కొన్నారు, భారత జట్టు సత్తా ఏస్థాయిలో ఉందో మరోసారి నిరూపించిందన్నారు. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా విషెస్ తెలిపారు.ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా, విజయం సాధించిన టీం ఇండియాకు అభినందనలు అని ఎన్టీఆర్ అన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Champions Trophy | రెండో వికెట్​ కోల్పోయిన న్యూజిలాండ్​ జట్టు

టీమ్ ఇండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన‌ అల్లు అర్జున్.. టీమ్ ఇండియా విన్నింగ్ ట్రోఫీని గెలవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అద్భుత‌మైన మ్యాచ్‌ని ఎంతో ఎంజాయ్ చేశాన‌ని రామ్ చ‌ర‌ణ్ అన్నారు. విజయాన్ని ఇంటికి మోసుకొస్తున్నారంటూ ట్వీట్ చేశారు రామ్ చరణ్. మెగ‌స్టార్ చిరంజీవి సైతం విషెస్ తెలిపారు. మనవాళ్ళను చూస్తుంటే గర్వంగా ఉంది అన్నారు. ఇండియా గెలుపును ఎంజాయ్ చేస్తున్నానంటూ జైహింద్ అని ముగించారు చిరంజీవి. టీమ్ ఇండియా గెలుపుతో తాను గర్వంతో ఉప్పొంగిపోయారని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు మ‌హేష్ బాబు.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ గెలిచిన తర్వాత మ‌హేష్ చాలా సంతోషంగా ట్వీట్ చేశారు.

Advertisement