Waqf Amendment Act | మత స్వేచ్ఛపై కేంద్రం దాడి.. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం

Waqf Amendment Act | మత స్వేచ్ఛపై కేంద్రం దాడి.. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం
Waqf Amendment Act | మత స్వేచ్ఛపై కేంద్రం దాడి.. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Waqf Amendment Act | కేంద్ర ప్రభుత్వం central government మత స్వేచ్ఛపై దాడి చేస్తున్నదని కాంగ్రెస్ నేత, లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ Rahul Gandhi విమర్శించారు. కేంద్రం ఇటీవల ఆమోదించిన వక్ఫ్ (సవరణ చట్టం)-2025 రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ BJP-RSS త్వరలోనే క్రైస్తవులు, సిక్కులు, ఇతర మైనార్టీల హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో AICC meeting బుధవారం రాహుల్ గాంధీ Rahul Gandhi ప్రసంగించారు. పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement

Waqf Amendment Act | ట్రంప్ కు లొంగిపోయిన మోదీ..

సుంకాల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు US President Donald Trump ప్రధాని మోదీ Prime Minister Modi లొంగిపోయారని రాహుల్ Rahul Gandhi ఆరోపించారు. ట్రంప్ చర్యల వల్ల ఆర్థిక తుఫాను సమీపిస్తోందన్నారు. “ప్రధాని మోదీ ట్రంప్ ను కౌగిలించుకుంటున్న ఫోటో మీరు చూశారా? ఈసారి ఆయన మోదీ జీని ‘మేము కౌగిలించుకోము కానీ కొత్త సుంకాలను విధిస్తాము’ అని అన్నారు. అయినా మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీని నుంచి దృష్టిని మళ్లించడానికి వారు పార్లమెంటులో Parliament రెండు రోజులు డ్రామా నడిపారని” వక్ఫ్ బిల్లును ప్రస్తావించారు.

Waqf Amendment Act | మోదీ ఎక్కడ దాక్కున్నాడు

ట్రంప్ సుంకాల Trump tariffs మోత మోగిస్తుంటే ప్రధాని మోదీ Prime Minister Modi ఎక్కడ దాక్కున్నాడని రాహుల్ ప్రశ్నించారు. ‘56 అంగుళాల ఛాతి’ ఎక్కడ అని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ తో Bangladeshi Prime Minister Muhammad Yunus భేటీపైనా రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. బంగ్లాదేశ్ నాయకుడు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నా అతనితో ప్రధాని భేటీ అయ్యారన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Gold price | మళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌.. ఆదివారం ఇలా భ‌గ్గుమంది ఏంటి?

Waqf Amendment Act | కుల గణన చేస్తాం..

కుల గణన చేసేందుకు కాంగ్రెస్ పార్టీ Congress party కట్టుబడి ఉందని రాహుల్ తెలిపారు. దేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీల జనాభా అధికంగా ఉందని, జనాభాకు అనుగుణంగా వారికి తగిన ప్రతిఫలం దక్కడం లేదన్నారు. దేశంలో కుల గణన caste census కోసం తాము కేంద్రంపై ఒత్తిడి చేస్తూనే ఉంటామన్నారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు reservation కల్పించాల్సి ఉందన్నారు. 50 శాతం రిజర్వేషన్లు అన్న గోడను తాము బద్ధలు కొడతామని ప్రకటించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన caste census చేసిందని, కానీ కేంద్రం ఆమోదించడం లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణలో కుల గణన చేసినట్లే దేశవ్యాప్తంగా చేస్తామన్నారు.

బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నదని రాహుల్ గాంధీ Rahul Gandhi ఆరోపించారు. అన్ని రాజ్యాంగ సంస్థలను వారు నియంత్రించాలని అనుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం Election Commission, న్యాయ వ్యవస్థ సహా అన్నింటిని గుప్పిట్లో పెట్టుకోవానుకుంటున్నారన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం రాజ్యాంగానికి విరుద్ధమని తెలిపారు. బీజేపీ వద్ద అన్ని ఉన్నాయని కానీ సత్యం, ప్రజల ప్రేమ తమ వైపే ఉందని చెప్పారు.

Advertisement