అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amith Shah | ఓలా(Ola), ఉబర్(Uber), ర్యాపిడో(Rapido) లాంటి సంస్థల దోపిడీ నుంచి ప్రజలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం(central government) సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో వీటి వినియోగం బాగా పెరిగిపోయింది.
ప్రజలు వీటిని ఆశ్రయిస్తుండటంతో యాజమాన్యాలు అందినకాడికి దండుకుంటున్నాయి. ప్రయాణికులను దోపిడీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(central government) సంచలన నిర్ణయం తీసుకుంది. సహకార్ ట్యాక్సీ(Sahakar Taxi) పేరుతో ఒక యాప్(App)ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah)పార్లమెంట్‌లో వెల్లడించారు.
Amith Sha | డ్రైవర్లకు ప్రయోజనం
ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీ(private companies)లు ప్రయాణికుల నుంచి భారీగా వసూలు చేస్తున్న డ్రైవర్లకు సరిగ్గా చెల్లింపులు చేయడం లేదు. దీంతో అటు డ్రైవర్లు(drivers), ఇటు ప్రజలు(People) నష్టపోతున్నారు. ఈ క్రమంలో డ్రైవర్లకు ప్రయోజనం కలిగించేలా సహకార ఆధారిత రైడ్-హెయిలింగ్ సేవ ‘సహకార్ ట్యాక్సీ’(Sahakar Taxi)ని ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో సహకార సంఘాలు ద్విచక్ర వాహనాలు, ట్యాక్సీలు, ఆటో రిక్షాలు నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తామని అమిత్ షా(Amit Shah)ప్రకటించారు. ఈ యాప్‌తో అటు డ్రైవర్లకు, ఇటు యూజర్లకు మేలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఈ యాప్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.