అక్షరటుడే, ఆర్మూర్: ప్రజాపంథా మార్గదర్శకుడు దుర్గంపూడి వెంకటకృష్ణ (డీవీకే) స్మారక విగ్రహాన్ని ఆర్మూర్‌లోని పార్టీ కార్యాలయంలో కేంద్ర కమిటీ నాయకుడు కేజీ రామచందర్ శనివారం ఆవిష్కరించారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి బి దేవారాం, ముత్తెన్న, రామకృష్ణ, సారా సురేష్, గంగాధర్, దుర్గంపూడి దీప, రమేష్, గోదావరి, సత్యమ్మ, కిషన్, బాబన్న, అశోక్, నరేందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.