అక్షరటుడే, కామారెడ్డి: జిల్లాలో భూగర్భ జలాల పెంపు చర్యలు బాగున్నాయని కేంద్ర జలశక్తి అధికారి బెంజిమెన్‌ కరుణాకరన్‌ అన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల జిల్లాలో నీటి వనరుల లభ్యత పెరుగుతోందని పేర్కొన్నారు. గురువారం కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ను కలిసి అభినందించారు. ఐదు రోజులుగా జిల్లాలోని వివిధ మండలాల్లో చెరువుల పూడికతీత, మొక్కల ప్లాంటేషన్‌, ఫాంపాండ్‌, ఫిష్‌ పాండ్‌, నాగన్న బావి, నిజాంసాగర్‌ డ్యాంలను పరిశీలించినట్లు తెలిపారు. కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో జల సంరక్షణకు జిల్లా అధికార యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వాళ్లలో కేంద్ర జల శక్తి అధికారి, కేంద్ర గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ జూనియర్‌ సైంటిస్ట్‌ అధర్వ శ్రీకృష్ణ పవార్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చందర్‌ నాయక్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement