అక్షరటుడే, బోధన్: ప్రస్తుత రోజుల్లో విద్యార్థులకు విలువలతో కూడిన విద్య చాలా ముఖ్యమని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సోమవారం పట్టణంలోని శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో ‘విలువలతో కూడిన విద్య ‘ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనేలా సంసిద్ధులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ పద్మశరత్ రెడ్డి, ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, చక్రవర్తి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.