నగరంలో గొలుసు చోరీ

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరంలో గొలుసు చోరీ జరిగింది. యెండల టవర్స్ రోడ్డులో ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. మోపాల్ మండలానికి చెందిన దంపతులు శుక్రవారం ఓ పని నిమిత్తం నిజామాబాద్ కు వచ్చారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.