అక్షరటుడే, నిజామాబాద్: నగరంలోని మూడో టౌన్ పరిధిలో గొలుసు చోరీ జరిగింది. మంగళవారం రాత్రి సుభాష్ నగర్ లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నాగరాణి మెడలో నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు స్నాచర్లు రెండు తులాల గొలుసును అపహరించుకెళ్ళారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.