అక్షరటుడే, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మంగళవారం ఉదయం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు నడుచుకుంటూ వెళ్తున్న రాజీవ్ నగర్ కు చెందిన మంజుల అనే మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసు అపహరించారు. గొలుసు లాక్కునే క్రమంలో మహిళ కింద పడడంతో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. దుండగులు అంతకు ముందు రాహుల్ నగర్ లోని ఓ కిరాణా దుకాణం వద్ద బైక్ నిలిపి రూ. 500నోటు ఇచ్చి సిగరెట్ అడిగారు. చిల్లరలేవని చెప్పడంతో ఐదు సిగరెట్లు ఇవ్వమనడంతో దుకాణం యజమానురాలు కృష్ణవేణి చిల్లర ఇస్తున్న క్రమంలో ఆమె మెడలో నుంచి గొలుసు లాగేందుకు యత్నించగా, ఆమె అప్రమత్తం కావడంతో వారు పరారయ్యారు.