అక్షరటుడే, ఆర్మూర్: చైన్‌స్నాచర్లు కొత్త పద్ధతుల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. మామిడిపల్లి చౌరస్తాలో శుక్రవారం ఆటోలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ కు చెందిన బ్రాహ్మణపల్లి నర్సు బాయ్ పెళ్లికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అయితే ఆటో లో మరో మహిళ ఉండగా.. ఆమెను మామిడిపల్లి చౌరస్తాలో దింపి పెళ్లి వద్ద దింపుతానని వృద్ధురాలిని ఆటో డ్రైవర్ నమ్మించాడు. అనంతరం ఆటోను హైవే వద్ద గల అయ్యప్ప ఆలయం సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆటో ను నిలిపి వేసి డ్రైవర్ తో పాటు అందులో ఉన్న ఓ మహిళ కలిసి వృద్ధురాలిని నుంచి మూడు తులాల గుండ్లు, తులం చైన్ ను లాక్కున్నారు. అనంతరం బాధితురాలిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.