Advertisement

అక్షరటుడే, ఇందూరు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో జూనియర్ రెడ్ క్రాస్ క్లబ్ లను ఏర్పాటు చేయాలని ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు తెలిపారు. గురువారం నగరంలోని రెడ్ క్రాస్ కార్యాలయంలో జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్లబ్ ఏర్పాటుతో చిన్నప్పటి నుంచే సేవా భావం అలవడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు తోట రాజశేఖర్, జేఆర్సీ కో-ఆర్డినేటర్ డాక్టర్ అబ్బాపూర్ రవి, జిల్లా కార్యదర్శి అరుణ్ బాబు, ఆర్సీవో, ప్రిన్సిపాల్ లు, పీఆర్వో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth | ప్రభుత్వ బడులపై రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు